ఆహార పదార్థాల్లో అతి మధురమైనది తేనె. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆయుర్వేదానికి ప్రాణంలాంటింది. అలాంటి తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. నీటి శాతం తక్కువగా ఉండటంతో అది పులియదు, పాడవదు. దీనిలో క్రిమిసంహారక గుణం ఉంది. అందుకే మన ఆహార పదార్థాలలో సుదీర్ఘ కాలం నిల్వ ఉండేది తేనె ఒక్కటే. కొన్ని తవ్వకాల్లో వందల ఏళ్ల నాటి తేనె కూడా ఇంకా చెడిపోకుండా ఉండటం చరిత్రకారులు గుర్తించారు.