శంకర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో సిపిఆర్ శిక్షణ
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో సోమవారం సిపిఆర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న అభ్యర్థులు రోగులకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి పిహెచ్సి డాక్టర్. రేవతిరెడ్డి, టంగుటూరు పిహెచ్సి డాక్టర్. సత్యజ్యోతి, సిహెచ్ఓ గోపాల్ రెడ్డి, హెచ్ఈఓ సుదర్శన్ రెడ్డి, సిపిఆర్ శిక్షకులు డాక్టర్ ప్రసాద్, ఆసుపత్రి సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సిపిఆర్ ట్రైనీలు పాల్గొన్నారు.