శంకర్ పల్లి మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

  • బీజేపీ మండల అధ్యక్షుడు రాములుగౌడ్

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం 43వ భారతీయ జనతా పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాలను ఎగురవేయడం జరిగిందని మండల బిజెపి అధ్యక్షుడు బస గళ్ళ రాములు గౌడ్ తెలిపారు. మండలంలోని రావులపల్లి, టంగుటూరు, ఎల్వర్తి, లక్ష్మారెడ్డి గూడ, జనవాడ, అలం ఖాన్ గూడ తదితర గ్రామాలలో పార్టీ జెండాలను ఎగురవేశామని తెలిపారు, ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, కన్వీనర్ ప్రతాపరెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజేందర్ సింగ్, రామకృష్ణారెడ్డి, నాయకులు రామచంద్ర, మండల పార్టీ ఉపాధ్యక్షులు శశి రెడ్డి, సంజీవరెడ్డి, నరసింహారెడ్డి వివిధ గ్రామాల భూత అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.