తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

  • బీజేపీ శంకర్ పల్లి పట్టణ అధ్యక్షుడు బిర్లా సురేశ్
  • శంకర్ పల్లిలో ఘనంగా బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం.

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో గురువారం బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. బిజెపి మున్సిపల్ కమిటీ అధ్యక్షుడు బిర్లా సురేశ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో పార్టీ జెండాలను నాయకులు ఎగరవేశారు. బీర్ల సురేష్ మాట్లాడుతూ లీకులు, లిక్కర్లు, అరెస్టుల పర్వం రాష్ట్రంలో కొనసాగుతుందని దుయ్యబట్టారు . బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిజెపి పేరు వింటేనే బెంబేలెత్తి హడలిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాజకుమార్, చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ కే. ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు బోరంపల్లి శ్రీకాంత్ రెడ్డి, లచ్చ గారి చెన్నారెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, అనిశెట్టి సురేష్, జయరాం రెడ్డి, నరేష్ కుమార్, బీజేవైఎం నాయకులు లోకేష్, కేశవ్, శ్రీనివాస్, మురళి, అశోక్ గౌడ్, జగదీష్, గొల్లపల్లి మల్లేష్, వికాస్, మాణిక్యం, శ్రీనివాస్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.