బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా శంకర్ పల్లిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు.

రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం మండల బిజెపి నాయకులు శంకర్ పల్లి ప్రధాన చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షుడు బసగల రాములు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక నియంతల ప్రవర్తించి బండి సంజయ్ను అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.

టి ఎస్ పి, ఎస్ఎస్సి ప్రశ్న పత్రాల లీక్ విషయంలో సెట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో నుండి బిజెపి లీకుల విషయంలో ఒత్తిడి చేస్తున్నందున కేసీఆర్ కుట్ర పని బిజెపి అధ్యక్షుని, మండలంలో ఉన్న బిజెపి నాయకులను, బీజేవైఎం నాయకులను టిఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ కి బహిరంగ క్షమాపణ చెప్పి విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతాపరెడ్డి, బీర్ల సురేష్, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ సింగ్, సింగాపురం రమేష్, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రామ్ రెడ్డి, హరినాథ్, సంజీవరెడ్డి, ధరమ్ సింగ్, బి. నరసింహారెడ్డి, మహేందర్, కేశవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం బిజెపి నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.