వికసించిన బ్రహ్మ కమలాలు

వికసించిన బ్రహ్మ కమలాలు
* సింగపూర్ టవర్ లోని బ్రహ్మకుమారి గృహంలో పూచిన పూలు
* బ్రహ్మకుమారీల ప్రత్యేక పూజలు

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ టవర్ కాలనీలో నివసిస్తున్న బ్రహ్మకుమారీల గృహములో సోమవారం రాత్రి 15 బ్రహ్మ కమలాలు విరబూశాయి. బ్రహ్మ కమలాలకు బ్రహ్మ కుమారీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓం శాంతి కాలనీ ఇంచార్జ్ బ్రహ్మకుమారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బ్రహ్మ కమలాల మొక్కలు హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయని చెప్పారు. ఈ కమలాలు ఎంతో పవిత్రమైనవని, ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిపారు.

స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు, క్యాన్సర్ వ్యాధికి ఈ మొక్కల ఆకులు, పూలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సరంలో తమ ఇంట్లో 15 బ్రహ్మ కమలాలు పూయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.