శంకర్ పల్లిలో ఘనంగా జ్యోతిబా పూలే జయంతి

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా ఉన్న జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, అశోక్, చంద్రమౌళి, మాజీ ఎంపీపీ వి.సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ బి. కృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సాతా ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్ బి. శ్రీధర్, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వి. వాసుదేవ్ కన్నా, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, శంకరయ్య, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.