మహనీయుల ఆశయ సాధనకు కేసిఆర్ కృషి
* విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
* కొత్తపల్లిలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ
* అంగన్వాడీ భవనం, బస్సు షెల్టర్ ప్రారంభోత్సవం
రచ్చబండ, శంకర్ పల్లి: మహనీయుల ఆశయ సాధనకు సీఎం కేసిఆర్ విశేష కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జాతిపిత గాంధీ, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే, స్వామి వివేకానంద విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడి భవనం, బస్సు షెల్టర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల జయంతుల పవిత్ర మాసమని, దేశ ఔన్నత్యాన్ని చాటిన వారందరినీ స్మరిస్తూ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు. అతి ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నగర నడిబొడ్డున నిలకోల్పడం చరిత్రాత్మకమని అన్నారు. వారి కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
కొత్తపల్లి గ్రామంలో దాతలు ఏర్పాటు చేసిన విగ్రహాలను మంత్రి ఆవిష్కరించారు. కాగా జ్యోతిబా పూలే విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ గౌండ్ల రవీందర్ గౌడ్ గ్రామానికి ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, డిసిఎంఎస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శాంతా చెన్నయ్య, ఎంపీటీసీ ఈ.
శోభ సుధాకర్ రెడ్డి, శంకర్ పల్లి ఏఎంసి చైర్మన్ ఎం. పాపారావు, మున్సిపల్ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, శంకర్ పల్లి మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మహారాజ్ పేట్ సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి మాజీ ఎంపీపీ మాల చిన్న నర్సింలు, నాయకులు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, ఈ. సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.