ప్రపంచ రాజ్యాంగాలకు మూలమేదో తెలుసా?

Kinds Of Constitutions

అతి పెద్దది ఏది? అతి చిన్నది ఏది?

ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల రూపకల్పనకు తొలి రూపం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా. క్రీ.పూ.2300 నాటి లగాష్ (అప్పటి ఇరాక్ లోని భాగం) రాజు ‘ఉరుకాగినా’ అనే పట్టికను కొన్ని నియమాలతో రూపొందించాడు. ఇదే రాజ్యాంగానికి తొలి రూపంగా భావిస్తారు.

అయితే ఇటలీ పక్కనే ఉండే శాన్మారినోది (1600 వ సంవత్సరం) తొలిస్థానం. తరువాతి స్థానం అమెరికాదేనట. అయితే రాజ్యాంగాలన్నింటిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉండటం విశేషం. 1,46,385 పదాలతో భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నింటిలో పెద్దది. ఆంగ్ల, హీందీ భాషల్లో చేతిరాతతో దీనిని రూపొందించారు. ఆ ప్రతిని పార్లమెంట్లో భద్రపరిచారు.

ఇక అతి చిన్న రాజ్యాంగం 3,814 పదాలతో ఉండే మొనాకో దేశ రాజ్యాంగం.