ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

* సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, రైతు సంఘం నాయకులు ఏనుగు మల్లారెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: ఫిబ్రవరి నెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, రైతు సంఘం నాయకులు ఏనుగు మల్లారెడ్డిల పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక గెస్ట్ హౌస్ లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మతోన్మాదంతో పరిపాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ మతోన్మాద కార్మిక వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుందని తెలిపారు. శంకర్ పల్లి పట్టణంలో సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు.

గ్రామపంచాయతీ యూనియన్ నూతన కమిటీ శంకర్ పల్లి మండలం గ్రామపంచాయతీ యూనియన్ సిఐటియు ఎన్నిక జరిగింది. మండల అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ప్రభాకర్, కోశాధికారి సుజాతను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ నాయకులు నరసింహ, రామచంద్రయ్య, శంకర్ పల్లి మండలం గ్రామ పంచాయతీ కార్మికులు మల్లేష్, అంజయ్య, అంతయ్య, రఘుపతి రెడ్డి, రాములు, భూపాల్, డి. రామచందర్ తదితరులు పాల్గొన్నారు