తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం శంకర్ పల్లి శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం శంకర్ పల్లి శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కాలసూచి 20 24 చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేతులు మీదుగా ఆదివారం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపస్ క్యాలెండర్ విద్యార్థులలో, ఉపాధ్యాయులలో దేశభక్తి భావాలను పెంచే విధంగా ఉందని, మహనీయుల చిత్రపటాలతో రూపొందించడం బాగుందని అభినందించారు. తాను ఏ పాఠశాలకు వెళ్లిన ముందుగా అక్కడి మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తానని చెప్పారు. ఈ మరుగుదొడ్లు సక్రమంగా ఉంటేనే విద్యార్థుల హాజరు శాతం పెరిగి విద్యాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తక్షణమే సిపిఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ గా పునరుద్ధరించాలని కోరారు.

317 జీవోను సవరించి స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు వెంటనే చేపట్టి బదిలీలు జరపాలని కోరారు. పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ప్రకటించాలన్నారు. తెలంగాణలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే అమలు పరచాలని కోరారు. ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీను, ఉపాధ్యాయులు రాజేందర్, జంగయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, యాదయ్య, సామాజిక కార్యకర్త మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.