నిరుద్యోగులపై పాలకురి అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు

నిరుద్యోగుల గొంతుకనవుతా.. పోరు కెరటమవుతా

 

* నిరుద్యోగుల పోరాటంలో 5 రోజుల ఆమరణదీక్ష,12 క్రిమినల్ కేసులు

* గెలిచినా ఓడినా విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతా

* రాజకీయ స్వలాభం కోసం వచ్చే వారిని నమ్మోద్దు

* సూర్యాపేటలో జోలే పట్టి గ్రంధాలయానికి సౌకర్యాలు కల్పిస్తా

* నల్లగొండ, ఖచ్యుం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోకుమార్

రచ్చబండ, సూర్యాపేట : పదేండ్ల జర్నలిస్టు జీవితం, లెక్చరర్గా పదేళ్ళ ప్రస్థానం, తెలంగాణ భారతదేశ చరిత్రను లక్షలాది మందికి భోధించిన అనుభవం, ప్రభుత్వ టీవి చావల్ టీ శాట్, మన టీవిలో నిరుపేద విద్యార్థులకు బోదన చేసిన తాను అశోక్ లైన్ అకాడమి స్థాపించి ఆన్లైన్లో తక్కువ పీజుతో నిరుపేద విద్యార్థులకు శిక్షణ అందించడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12′ క్రిమినల్ కేసులు, చంచల్ గూడ జైలు జీవితం గడిపిన కాను విద్యార్థుల కోసం ఐదు రోజుల అమరణ నిరాహార దీక్ష చేయడం జరిగిందని దీన్ని గుర్తించిన నిరుద్యోగులు తమకు మద్దతుగా నిలబడాలని పిలుపునీవ్వడంతో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నట్లు ప్రముఖ విద్యావేత్త పాలకూరి అశోకుమార్ తెలిపారు.

 

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎన్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంతో మందిరి విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా నిరుద్యోగుల సమస్యల పరిస్కారం కోic తిరుగులేని ఉద్యమం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ రిజర్వేషన్ ఉద్యమం చేపట్టి రెండున్నర లక్షల మందిని గ్రౌండ్ వరకు తీ 1 కొచ్చానన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ళ లాంగ్ జంప్ ఈవెంట్స్ విషయంలో అలుపెరగని పోరాటం చేసిన తాను గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో గత పదేళ్ళుగా ఏజ్ రిలెగ్జాషన్ ఇవ్వనప్పుడు-వారికి అండగా ఉన్నానన్నారు.

 

గ్రూప్1లో డీఎస్సీ ఉద్యోగుల హైట్ విషయంలో సర్కార్తో కొట్లాడి 167.6కు ఉన్న హైట్ను 165కి తగ్గించి లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేశానన్నారు. టీఎస్పీఎస్సి పేపర్ లీకేజీలపై పోరాడిన తనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చంచల్ గూడ జైలుకు పంపిందన్నారు: జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్లో కేవలం ఇంగ్లీషు మీడియంలోనే పరీక్ష వ్రాయాలని నిబందన పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు మీడియంలో పరీక్షలు పెట్టేలా కొట్లాడి 5లక్షల మంది తెలంగాణ గ్రామీణ విద్యార్థులకు న్యాయం చేశానన్నారు. నిరఃద్యోగులను గత ప్రభుత్వం మోసం చేసించని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే మోసం చేయడానికి ప్రయతిస్తుందన్నారు.

 

గత ప్రభుత్వం ఇచ్చిన నోటిపికేషన్లకే ఈ ప్రభుత్వం కేవలం పరీక్షలు పెట్టి ఒక్క కొత్త నోటిషికేషన్ వేయకపోవడంతో డీఎస్సీ పోస్టులు పెంచాలని గ్రూప్2 పోస్టులు పెంచాలని, టెట్’ నోటిఫికేషన్ వేయాలనీ, గురుకుల పోస్టులు మిగలకుండా సంపూర్ణంగా నింపాలనే లక్ష్యంతో ప్రానాలు పనంగా పట్టి ఐదు రోజుల పాటు అమరణ నిరాహారదీక్ష చేసి గత మూడేళ్ళుగా ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో పాలు పంచుకొని వాళ్ళకు అండగా నిలబడ్డానన్నారు. ఒక జర్నలిస్టుగా పని చేస్తు తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్ధిగా ఉస్మానియా యూనివర్శిటిలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాలు పంచుకొని ఉద్యమం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని వారు ఎమ్మెల్యే టికెట్ రాకుంటే ఎంపీకి, ఎంపీ టికెట్ రాకుంటే ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారని అన్నారు.

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 2లక్షల ఇయర్ క్యాలండర్ను వెంటనే విడుదల చేయాలి, హైద్రాబాద్లోని ఫార్మా, సాఫ్ట్వేర్ కంపెనీల్లో స్థానికులకు 70శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రూప్ 2కు వెయ్యి, గ్రూప్-3కి 2 వేల ఉద్యోగాలు ఇచ్చి 25వేల పోస్టులకు మెగా డీఎస్పీ నిర్వహించాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన జోనల్ సిస్టంతో హైద్రాబాద్ రెడ్జోన్గా ఏర్పడి స్థానికేతరులకు ఉద్యోగాలు పోతున్నాయని హైద్రాబాద్ను ఫ్రీ జోన్ చేసి 70శాతం మంది తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నిరుద్యోగుల పిలుపుతో వచ్చిన తనకు నిరుద్యోగుల సమస్యలు తెలుసని తాను గెలిచినా గెలవకున్నా నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు.

 

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గ్రంధాలయంలో పాఠకులు, నిరుద్యోగులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం సూర్యాపేటలో జోలే పట్టెనా. డబ్బులు పోగు చేసి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గ్రంధాలయ ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటానికి వేదికగా ఉన్న సూర్యాపేట విరుద్యోగులు, మేధావులు అభ్యర్థులు వివరూ. ఎందుకు వస్తున్నారో తెలుసుకొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసి తనను గెలిపిస్తే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే గొంతుకను అవుతానన్నారు. ఆయన వెంట నిరుద్యోగ, విద్యార్థి యువకులు ఆకాష్, శంకర్, ప్రవీణ్, నవీన్ పట్నాయక్, భాను, విక్రమ్, ఆస్మా, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.