నిత్య అభ్యసనం, నిరంతర పరిశోధనతోనే బంటు కృష్ణ రాణింపు
* అప్డేటెడ్ జర్నలిజం తోనే మీడియా రంగంలో గుర్తింపు
* సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవికుమార్
* జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణకు ఘన సన్మానం
* షీ టీం ఎస్సై ప్రవీణ్ కుమార్, జెడ్పిటిసి జీడి బిక్షం అభినందనలు
* జర్నలిస్టులు నవిలే బద్రీనాథ్, పాషా, శంకర్ తదితరుల శుభాకాంక్షలు
సూర్యాపేట, రచ్చబండ: నిత్య అభ్యసనం, నిరంతర పరిశోధన తోనే విద్యారంగంలో రాణించి అగ్ర శిఖరాలకు చేరుకోవచ్చని, జర్నలిజం రంగంలో నానాటికి వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు కూడా అప్డేట్ అయితేనే మీడియా రంగంలో మరింతగా గుర్తింపు వస్తుందని సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవికుమార్ చెప్పారు. ఇటీవల జర్నలిజంలో పీహెచ్ డీ పట్టాతో డాక్టరేట్ పొందడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించి, గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అందుకున్న సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణను డీఎస్పీ రవికుమార్, షీటీం ఎస్సై ప్రవీణ్ కుమార్, సూర్యాపేట జెడ్పిటిసి జీడి భిక్షం, జర్నలిస్టులు నవిలే బద్రీనాథ్ శంకర్ పాషా రాజశేఖర్, హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు దైద వెంకన్న శుక్రవారం బొకేలు, పూలదండలు, శాలువాలతో ఘనంగా వేర్వేరుగా సన్మానించిన సందర్భంగా మాట్లాడారు.
పత్రికా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తూనే విద్యారంగంలో కూడా అగ్ర శిఖరమైన గోల్డ్ మెడల్ ని కూడా సాధించడం బంటు కృష్ణ నిరంతర శ్రమకు, కృషికి నిదర్శనం అని చెప్పారు. విద్యారంగం, మీడియా రంగంలో అకుంఠిత దీక్ష, మొక్కవోని ధైర్యంతో ప్రతిభను చాటుకొని సూర్యాపేట పేరును రాష్ట్రంలోనే ప్రముఖంగా వినిపించేలా చేయడం, తను సాధించిన ఇంత గొప్ప ఘనతను కన్న తల్లిదండ్రులకు, ప్రపంచ మేధావిగా కొనియాడ బడిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అంకిత ఇవ్వడం బంటు కృష్ణ లోని మానవత్వానికి, విజ్ఞాన తత్వానికి రోల్ మోడల్ గా చెప్పుకోవచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొండ్లె కృష్ణయ్య, అజయ్, మామిడి శంకర్, పడిసిరి వెంకట్, జహీర్, యగ్గే శంకర్, మామిడి శ్రవణ్, సైదులు గౌడ్, ఉయ్యాల నరసయ్య, వెంకన్న, పాష, సతీష్, బాచి, దుర్గం బాలు, కలుకూరి విజయ్, షీ టీం జాఫర్, ఎల్లారెడ్డి, శివరాం తదితరులు పాల్గొన్నారు.