ప్రభుత్వం సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

ప్రభుత్వం సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలి

* తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కాశీరావు

రచ్చబండ,శంకర్ పల్లి: ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా తక్షణమే సీపీఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కాశీరావు డిమాండ్ చేశారు. శుక్రవారం శంకర్ పల్లిలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అయన మాట్లాడుతూ 317 జీవోను సవరించి స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు కేటాయించాలని కోరారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వెంటనే చేపట్టి బదిలీలు జరపాలన్నారు.

పెండింగ్ లో ఉన్న డి ఏ లను వెంటనే ప్రకటించాలని తెలిపారు. తెలంగాణలో నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే అమలు పరచాలని కోరారు. విద్యార్థులు విద్య పట్ల ఆకర్షితులై దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉండాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల ప్రగతి కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీను, ఉపాధ్యాయులు రాజేందర్, జంగయ్య, నందు, వెంకటేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్, కృష్ణయ్య, భక్తప్ప పాల్గొన్నారు.