కొండకల్ లో భక్తిశ్రద్ధలతో మల్లికార్జున భ్రమరాంబ కళ్యాణోత్సవం

కొండకల్ లో భక్తిశ్రద్ధలతో మల్లికార్జున భ్రమరాంబ కళ్యాణోత్సవం

* బోనాలతో మొక్కులు తీర్చుకున్న వందలాది మంది మహిళలు

 

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో ఆదివారం మల్లికార్జున భ్రమరాంబ కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు జరుపుకున్నారు. గ్రామంలో బోనాల ఊరేగింపు ఆకట్టుకున్నది. వందల సంఖ్యలలో మహిళలు బోనాలను తలపై పెట్టుకుని మల్లికార్జున భ్రమరాంబ కళ్యాణోత్సవానికి హాజరయ్యారు.

ఈ కళ్యాణోత్సవానికి చేవెళ్ల నియోజకవర్గం కొండకల్ లో భక్తిశ్రద్ధలతో మల్లికార్జున భ్రమరాంబ కళ్యాణోత్సవం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్ సతీమణి జ్యోతి భీమ్ భరత్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు శంకర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి.జనార్దన్ రెడ్డి, కొండకల్ గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య కాశీనాథ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం డి. అజాజ్, బద్దం కృష్ణారెడ్డి, శశి, కొజ్జా గూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.