శంకర్ పల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ శ్రీనివాసులుకు ఘాన సత్కారం

శంకర్ పల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ శ్రీనివాసులుకు ఘాన సత్కారం
* సత్కరించిన సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీకి నూతనంగా బదిలీపై వచ్చిన కమిషనర్ శ్రీనివాస్ ను సోమవారం పలువురు ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్మికులు పురపాలక సంఘం ఏర్పడిన నాటినుండి నుండి నిధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు, ఎలక్ట్రిసిటీ, వాటర్ మెన్, బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరి సమస్యలు పరిష్కరించడానికి నూతనంగా మునిసిపాలిటీకి బదిలీపై వచ్చిన కమిషనర్ శ్రీనివాస్ చొరవ చూపాలని కోరారు.

కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో పని చేసే కార్మికులు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు శంకరపల్లి అధ్యక్షులు బిస్సోల్ల రమేష్, ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, ఉపాధ్యక్షులు మోహన్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి రాములు కమిషనర్ను సన్మానించిన వారిలో ఉన్నారు.