సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణిగా లతా 

సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణిగా లతా

రచ్చబండ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి(DSCDO)గా లతా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాఘిక సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.

సీనియర్ అసిస్టెంట్ గా, సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. సోమవారం సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి (DSCDO)గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణిగా పదవీ బాధ్యతలు చేపట్టిన లతా గారికి షెడ్యూల్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ ఉద్యోగులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులూ శుభాకాంక్షలు తెలిపారు.