Aluganti Madhusudanreddy.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

Aluganti Madhusudanreddy.. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది

* టీపీసీసీ జనరల్ సెక్రటరీ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ అలుగంటి మధుసూదన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్ అలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం శంకర్ పల్లి లోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 2024 సంవత్సరం క్యాలెండర్, అలాగే టియుటిఎఫ్ 2024 సంవత్సరం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్ర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని గుర్తు చేశారు. అందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాట వేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ దాడిగారి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి తాను ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తన శాయశక్తుల వారి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎండి. తాహిర్ అలీ, మండల అధ్యక్షులు జి. నాగేష్, ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు వనజ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ జయసింహారెడ్డి పాల్గొన్నారు.

అదేవిధంగా టియుటిఎఫ్ అధ్యక్షులు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, సిహెచ్. యాదయ్య, శ్రీనివాస్, మండల ఆర్థిక కార్యదర్శి రామకృష్ణ, ఉపాధ్యక్షులు గోపాల్, కార్యదర్శి ఎస్కె రియాజుద్దీన్, మహిళా కార్యదర్శి సదాలక్ష్మి, జ్యోతి, రాజేశ్వరి, కవిత, నౌషిన్ సుల్తానా, కౌసర్, జ్యోతి, లలిత, సుకన్య, ఝాన్సీ, కృష్ణవేణి, బాల థెరిసా, పద్మ, సరిత, మనీలా, ప్రణీత, సుగుణ, అనిత, సంతోష, కవిత, శంకర్ పల్లి ఏఎంసి డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, కాజా, దాసు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా తమ సంస్థ క్యాలెండర్ ప్రచురణకు సహకరించిన శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డికి ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు