బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ది దేశంలోనే సరికొత్త రికార్డ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ది దేశంలోనే సరికొత్త రికార్డ్

తాజాగా మరోమారు బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకరం చేసిన నితీశ్ కుమార్ దేశంలోనే రికార్డు సృష్టించారు. జనతాదళ్ (యూ) నేత అయినా నితీశ్ కుమార్ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉండగానే దాని మద్దతును వదులుకొని బీజేపీ పంచన చేరిపోయారు. ఇటు రాజీనామా చేసిన 24 గంటల్లోనే బీజేపీ మద్దతుతో నితీశ్ కుమార్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకరం చేశారు. తరుచూ పార్టీలు మారే నేతలను చూశాం కానీ ఇలా అధికారాన్ని మార్చిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.

17 ఏళ్ల 158 రోజుల పాలనతో ఆయన 11వ స్థానంలో ఉన్న ఆయన దేశంలో సుదీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలతో పోటీ పడుతున్నారు. అయితే ప్రమాణ స్వీకారంలో మాత్రం దేశంలోనే రికార్డు సాధించారు. పదవీకాలం పరంగా 10 మంది తర్వాత ఉన్నప్పటికీ, సీఎంగా ప్రమాణాల పరంగా మాత్రం నితీశ్‌దే రికార్డు. ముఖ్యమంత్రిగా 9 సార్లు ప్రమాణం చేసిన ఆయన తప్ప దేశంలో మరెవరూ లేరు. నితీశ్‌ కుమార్‌ కన్నా ఎక్కువ కాలంపాటు ముఖ్యమంత్రులుగా పని చేసిన 10 మందిలో 9 మంది ఐదుసార్లు సీఎంగా ప్రమాణం చేయగా, మాణిక్‌ సర్కార్‌ నాలుగు సార్లే ప్రమాణం చేశారు. వీరందరికన్నా వెనక ఉన్న నితీశ్‌ మాత్రం 9 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకరం చేసి దేశంలోనే ‘రికార్డు’ నెలకొల్పారు.