ఎన్టీపీసీలో మహిళా ఇంజినీర్ల ఎంపికకు దరఖాస్తులు

ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో మహిళల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను సంస్థ విడుదల చేసింది. దీని ద్వారా 50 పోస్టులను భర్తీ చేయనుంది. ఇవి మెకానికల్, ఎలక్ర్టికల్, ఎలక్ర్టానిక్స్, ఇనుస్ర్టుమెంటేషన్ విభాగంలో ఉన్నాయి. గేట్ 2021 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సంస్థ పేర్కొన్నది. అయితే ఈ పోస్టలకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆన్ లైన్ దరఖాస్తులు వచ్చే నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.

మొత్తం పోస్టులు – 50

వివరాలు – వీటిలో మెకానికల్ 14, ఎలక్ర్టికల్ 22, ఎలక్ర్టానిక్స్, ఇనుస్ర్టుమెంటేషన్ 14 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హత – సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 27 ఏళ్లలోపు వయసు కలిగిన వారై ఉండాలి.
ఎంపిక విధానం – గేట్ 2021 మార్కుల ఆధారంగా..
దరఖాస్తు ప్రక్రియ – ఆన్ లైన్ లో
దరఖాస్తులు ప్రారంభం – ఏప్రిల్ 16
దరఖాస్తులకు చివరి గడువు – మే 6