ఇక పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా ‘గాంధీ’

హైదరాబాద్; గతేడాది చాలాకాలం పాటు సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన రాష్ట్రంలోని వేలాది మంది కొవిడ్ బాధితులకు విశేష సేవలందించింది. ఇక శనివారం నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారనుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి దవాఖానలో ఓపీ సేవలు నిలిచి పోనున్నాయి.

ఈ దవాఖానలో అత్యవసర సేవలను సైతం నిలిపివేశారు. కేవలం కొవిడ్ బాధితులకు మాత్రమే వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇప్పటికే దవాఖానలో 450కి పైగా రోగులు ఉన్నారు. గురువారం ఒక్కరోజే 150 మంది చికిత్స నిమిత్తం చేరారు.

గాంధీ దవాఖానకు కొవిడ్ రోగుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు వివిధ శాఖలను వైద్యులు ఖాళీ చేయిస్తున్నారు.