ఆ ఉద్యోగులకు రెండు రోజులు సెలవులోచ్

వారానికి రెండు రోజులు సెలవులు. ఐదు రోజులే పనిదినాలు. ఆదివారంతో పాటు శనివారం కూడా కార్యాలయాలు మూసే ఉంటాయి.. ఇదీ ఎల్ఐసీ (భారతీ జీవిత బీమా) యాజమాన్యం ఉద్యోగులకు కల్పించిన అరుదైన అవకాశం.

దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ తమ ఉద్యోగులకు మరో తీపి కబురు అందించింది. ఉద్యోగుల వేతనాలు 16 శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించింది. 2017 ఆగస్టు నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది.

సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లే కంటే ముందే తమ వేతన సవరణ తేల్చాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లనుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.లక్శ కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది.