దీనిభావమేమి.. మనిషి గుణ ఈశా:

నీతి వాక్యాలు

సమాజంలో అందరూ నీతులు చెప్తారు.. కానీ
అవే నీతులు పాటించాలంటే వంకలు పెడతారు

ఇరుగు పొరుగు వారి ముచ్చట్ల వినేందుకు చెవులు కోసుకుంటారు.. కానీ వారి ముచ్చట్లు మాత్రం బయట ఎవరికీ తెలియద్దొనుకుంటారు

కనపడే దేవుళ్లను అనాథ శరణాలయాల్లో వదిలి..
కనపడని దేవుళ్ల కోసం గుళ్లు, గోపురాలు తిరుగుతారు

పోయాక ఫొటోను ప్రేమించడం కన్నా
బతికి ఉన్న మనిషిని ప్రేమించడం మిన్న

తన దగ్గర డబ్బులు లేనప్పుడు పక్కవాడికి సాయం చేయాలి అనిపిస్తుంది..
తన దగ్గరకు డబ్బులు రాగానే జల్సాలు చేయాలనిపిస్తుంది

చావు వస్తుందని తెలిసినా బతికేస్తున్నాం..
జీవితంలో బాధ వస్తే బతకలేమా?

అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది.. ఎందుకంటే దానికి భయం ఎక్కువ
నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ

కడుపు కట్టుకొని సంపాదించు.. రేపు బిడ్డలకు మంచిది.. అంతే కానీ
వేరే వారి కడుపుకొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది..

అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కరలేదు. హోదా అంతకన్నా అక్కరలేదు.
మంచి అనిపించుకో అందరూ నీకు అభిమానులే..