దెయ్యాల పట్టణాన్ని జనం వదిలేశారు.. ఎందుకు? ఎక్కడో తెలుసా..?

రాజస్థాన్ రాష్ట్రంలోని కుల్దారా అనే పట్టణాన్ని దెయ్యాలున్నాయనే కారణంతో జనం వదిలేశారు. ఊరి వారంతా తమ నివాస స్థలాలను వదిలేసి ఉన్న ఫలంగా దూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. వ్యవసాయ భూములను వదులుకున్నారు.

ఇప్పుడు కుల్దారలో నివాస శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి. మొండి గోడలే దర్శనమిస్తున్నాయి. దాంతో అప్పటి నుంచి శాతాబ్దాలుగా ఈ ఊరు హాంటెడ్ టౌన్ హోదా పొందింది.

అయితే నిజంగా దెయ్యాల కారణంగానే వదిలేశారా.. మరే కారణంగానైనా వదిలేశారా అన్న ప్రశ్నలు మాత్రం ఇప్పటికీ తొలిచేస్తున్నాయి. ఎవరికి వారు మూడు సమాధానాలను వెతుక్కుంటున్నారు.

అవి ఏంటంటే.. 1) ప్రకృతి వైపరీత్యానికి ఊరు ధ్వంసమైందని, అందుకే ఇళ్లు నివాస యోగ్యం కాకపోవడంతో ఊరు ఊరంతా వేరే చోటుకు తరలివెళ్లినట్లు చెప్తున్నారు.

2) స్థానిక పాలకులు నిరంకుశులు. వారి పాలనలో జనం మగ్గేవారు. పాలకుల ఈతిబాధలు భరించలేక, పన్నులు చెల్లించలేక ఉన్న ఊరిని, వ్యవసాయ భూములను వదిలేసి వేరే చోటుకు వెళ్లినట్లు మరో కథనం అందుబాటులో ఉంది.

3) పురాణాల ప్రకారం.. పూర్వ నివాసుల శాపం కారణంగా ఆ ఊరు నివాస యోగ్యం కాదని, ఏదో కీడు జరుగుతుందనే అనమానంతో ఊరు ఊరంతా తరలి వెళ్లింది.