నరేష్, పవిత్రా లోకేష్ పై మైసూర్ లో దాడికి యత్నం

సినీ నటీనటులు నరేష్, పవిత్రా లోకేష్ పై మైసూరులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి దాడికి యత్నించారు. ఓ కన్నడ సినిమాలో నటిస్తున్న నరేష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆదివారం మైసూరులో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఓ లాడ్జి గదిలో నరేష్, పవిత్రా లోకేష్ ఉన్నారన్న విషయం తెలుసుకున్న నరేష్ మూడో భార్య అక్కడికి వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించారు.

లాడ్జి గది నుంచి నరేష్, పవిత్ర బయటకు వస్తుండగా రమ్య చెప్పుతో దాడికి యత్నించింది. అక్కడున్న పోలీసులు అడ్డుకోవడంతో పవిత్ర ఆమె దాడి నుంచి తప్పించుకున్నారు.

ఈ సమయంలో నరేష్ కేరింతలు కొడుతూ, విజిల్స్ వేస్తూ, కేకలు పెడుతూ వెళ్లిపోయారు. లిఫ్టు నుంచి పోలీసుల సహాయంతో బయటకు వెళ్లారు.

ఇదే సమయంలో రమ్య రఘుపతి చేసిన ఓ కామెంట్ అందరిలో ఆసక్తిని కలిగించింది. విజయనిర్మల ఇచ్చిన రూ.50 లక్షల విలువైన నెక్లెస్ ను నరేష్ పవిత్రకు ఇచ్చాడంటూ ఓపెన్ కామెంట్ చేసింది. తనకు అన్యాయం చేశాడంటూ నరేష్ పై ఆరోపణలు గుప్పించింది.