అతడికి 76 ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు! ఎదురుకట్నం ఎంతిచ్చాడో తెలుసా?

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారట.. మరి వీరి పెళ్లి కూడా అక్కడే నిర్ణయించారేమో.. అందుకే వయసు అంతరాలున్నా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఎంచక్కా బంధుమిత్రుల సమక్షంలో దండలు మార్చుకొని పెళ్లి తంతును కానిచ్చేశారు.

పాండిచ్చేరిలో 75ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. అక్కడి వినాయక స్వామి గుడి ప్రాంగణంలో ఇద్దరూ వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వరుడు వధువుకు ఎదురు కట్నం ఇచ్చాడు. ఎంతో తెలుసా.. రూ.2.5 కోట్లు వధువుకు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఇదీ మ్యాటర్.