నేటి నుంచే భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!

రచ్చబండ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలనే సంకల్పంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ యాత్ర చేపడుతున్నారు.

బుధవారం సాయంత్రం 5 గంటలకు కన్యాకుమారిలో యాత్ర షురూ అవుతుంది. అక్కడి నుంచి కశ్మీర్ వరకు 150 రోజుల వరకూ సాగుతుంది. రాహుల్ తో పాటు 118తో కూడిన భారత్ యాత్రిక్ టీం సభ్యులు పాల్గొననున్నారు.

రోజూ ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు యాత్ర కొనసాగుతుంది. రోజుకు సుమారు 25 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రతో కాంగ్రెస్ లో పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ కేడర్ లో జోష్ నిండుకుంది.