హైదరాబాద్ నగరంలో ఈ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసా?

రచ్చబండ : హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ ఫైన్ వేస్తున్నారు.

ఒకే ఉల్లంఘనపై మూడు సార్లు దొరికితే 400 శాతం అదనంగా ఫైన్ వేస్తున్నారు. ఇలా ఏటా ఉల్లంఘన కేసులు 40 లక్షల మేరకు నమోదు అవుతున్నాయట. వాటిలో హెల్మెట్ లేని కేసులే 29 లక్షల వరకు ఉన్నాయి.

నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో సగటున 290 మంది వరకు చనిపోతున్నారు. వాటిని తగ్గించేందుకే ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.