హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడీ సోదాలు.. మద్యం కుంభకోణంపై విచారణ

రచ్చబండ, హైదరాబాద్ : మద్యం కుంభకోణం ఆరోపణల విషయంలో ఈడీ అధికారులు హైదరాబాద్ నగరంలో మంగళవారం సోదాలు చేపడుతున్నారు. నగరంలోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతోన్నాయి. ఢిల్లీ, లక్నో, చెన్నై, బెంగళూరు, గురుగావ్ నగరాల్లోనూ ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు.

హైదరాబాద్ లో అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినిపల్లి అభిషేక్ రావు, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్, రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. ఆయా సోదాల్లో ఎవరి బాగోతం బయటపడుతుందోనన్న ఆసక్తి ఉంది.