ఉత్తేజపర్చిన బండి సంజయ్ స్పీచ్

రచ్చబండ : హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రసంగం సభికులకు ఉత్తేజపరిచింది. ప్రధాని మోడీ గురించి ప్రస్తుతిస్తూ చేసిన ప్రసంగానికి సభికులు జేజేలు పలికారు. మోడీ దేవుడంటూ కొనియాడారు.

మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని, తెలంగాణలో మోడీ సైన్యం యుద్ధానికి సిద్ధమైందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి వేల కోట్ల నిధులు ఇస్తున్నారని వివరించారు. కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గొప్పతనం తెలియదని అన్నారు. మోడీ నీతివంతమైన పాలన తెలంగాణలోనూ రావాలని కోరారు.

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేసీఆర్ ను ప్రశ్నించారు. అభివృద్ధికి సహకరించడం లేదని అన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బందీ అయిన తెలంగాణను విడిపించుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధికోసమే కేసీఆర్ మోడీని విమర్శిస్తున్నారని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఒక్కొక్కరిపై 1.20 లక్షల అప్పు ఉందని అన్నారు.