ఒకే పాఠశాలలో 31 మంది విద్యార్థులకు, 10మంది తల్లిదండ్రులకు కొవిడ్.. తాత్కాలికంగా స్కూల్ మూసివేత

ఒకే పాఠశాలలో 31 మంది విద్యార్థులకు కొవిడ్ సోకింది. వారిలో 10 మంది తల్లిదండ్రులకూ సోకడం ఆందోళన కలిగించే విషయం. ఇది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

తమిళనాడు రాష్ట్రం ఆండిపట్టి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వారిలో 31 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. వారి తల్లిదండ్రులను పరీక్షించగా 10 మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది.

ఈ మేరకు పాఠశాలను తాత్కాలికంగా మూసివేసినట్లు విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే పాఠశాలలో శానిటేషన్ చర్యలు చేపట్టారు. దీంతో ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వైద్య శాఖ ప్రజలను కోరింది.