ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతివ్వాలని థాకరేకు లేఖ రాసిన మరో శివసేన ఎంపీ

రచ్చబండ : రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన పార్టీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ అధినేత ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీ ఉద్ధవ్ కు లేఖ రాశారు.

ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని శివసేన ఎంపీ రాజేంద్ర గవిట్ రాసిన లేఖ ఆ పార్టీ వైఖరిపై మరోసారి చర్చకు తెరలేపింది. గిరిజనుడైన గవిట్ ఎన్డీయే వైపే మొగ్గు చూపాలని సూచించారు.

గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే గౌరవంగా భావించాలని పార్టీ చీఫ్ థాకరేను ఎంపీ గవిట్ ఆలేఖలో కోరారు. అందుకే మద్దతు ప్రకటించాలని ఆయన పేర్కొన్నారు.