సీఐపై సస్పెన్షన్ వేటు.. మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైనం..

రచ్చబండ : హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. ఓ మహిళతో లాడ్జిలో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్య తీసుకున్నారు.

సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలున్నాయి. గత రాత్రి ఏకంగా వనస్థలిపురంలోని ఓ లాడ్జిలో అదే మహిళతో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

అనంతరం ఆ మహిళ భర్త వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ నాగేశ్వరరావుపై లైంగిక దాడి, మర్డర్, కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.