రచ్చబండ : కల్తీ మద్యం తాగి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ రాష్ట్రంలోని పుర్బా బర్ధమాన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకొంది.
ఈ మేరకు బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ఆ రాష్ట్ర పరిపాలన, ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఘటన జరిగిన తర్వాత అదేరోజు వెస్ట్రన్ జోన్ ఏడీజీ సంజయ్ సింగ్, వెస్ట్ బుర్వ్దాన్ ఎస్పీ కమనాశిశ్ నకిలీ మద్యం కోసం తనిఖీలు చేపట్టారు.