మరో 5రోజులు భారీ వానలు.. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

రచ్చబండ : రాబోయే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. వరద ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న రాష్ట్రాల జాబితాను కూడా భారత వాతావరణ శాఖ శనివారం తాజాగా విడుదల చేసింది. రానున్న 5 రోజుల్లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

వచ్చే ఐదు రోజుల్లో గోవా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈనెల 12 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది.