రచ్చబండ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వచ్చి వెళ్లారు. తాజాగా సోమవారం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు.
బుధవారం ఉదయం యశ్వంత్ సిన్హా ఓ ప్రకటన విడుదల చేశారు. దేశానికి నిశ్శబ్ద రాష్ట్రపతి అవసరం లేదని పేర్కొన్నారు. నైతిక అధికారం, విచక్షణను వినియోగించే నేత అవసరమని సిన్హా తెలిపారు.
రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీ సంస్థల ద్వారా కేంద్రంలోని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని సిన్హా ఆరోపించారు. తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే అలాంటి చర్యలను ఆపేస్తానని స్పష్టం చేశారు.