భారీ వర్షాలకు 24గంటల్లో ఆరుగురి మృత్యువాత.. 69కి చేరుకున్న మృతుల సంఖ్య

రచ్చబండ : భారీ వర్షాలకు గడిచిన 24 గంటల్లో వివిధ చోట్ల ఆరుగురు మృత్యువాత పడ్డారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 69కి చేరుకుంది. ఇదీ గుజరాత్ రాష్ట్రంలో జరిగిన విపత్తుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తెలిపిన లెక్క.

రాష్ట్రంలో వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరుగుతుందేమోనని ఆందోళనలో ఉన్నారు. గత 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారని రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి రాజేంద్ర తివారీ తెలిపారు.

ఓ 50 ఏళ్ల వ్యక్తి రాజ్ కోట్ లోని వరద నీటిలో అందరి కళ్లముందే కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల వరదలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.