గరిష్ఠ నీటిమట్టం దాటిన హుస్సేన్ సాగర్.. పొంచి ఉన్న ప్రమాదం

రచ్చబండ : గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరద ముంచెత్తుతోంది. నగర పైభాగం నుంచి వస్తున్న వరదతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో మణిమకుటం లాంటి హుస్సేన్ సాగర్ జలాశయ నీటి మట్టం గరిష్ఠస్థాయిని దాటేసింది.

మరింత వరద కొనసాగినా, వర్షాలు కురిసినా దిగువ ప్రాంత ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

హుస్సేన్ సాగర్ జలాశయ గరిష్ఠ నీటిమట్టం 513.41 మీటర్లు. బుధవారం ఉదయం నాటికి 513.44గా నమోదైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుస్సేన్ సాగర్ నుంచి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. అయితే వర్షం కొనసాగితే దిగువకు ప్రమాదం ఉంటుందని తెలిపారు.