ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ దావా.. కొనుగోలు ఒప్పందం ఉల్లంఘనపై చర్య

రచ్చబండ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ట్విట్టర్ యజమాన్యం కోర్టులో దావా వేసింది. ట్విట్టర్ డీల్ వ్యవహారంలో వెనక్కి తీసుకునే ఒప్పందాన్ని మస్క్ ఉల్లంఘించారన్న విషయమై దావా వేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

ట్విట్టర్ కొనుగోలు నుంచి వైదొలిగే $44 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ఆయన ఉల్లంగించారని ట్విట్టర్ యాజమాన్యం తెలిపింది.

అయితే ట్విట్టర్ తన నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వాలంటూ తన అభ్యర్థనలకు సకాలంలో స్పందించడంలో దాని యాజమాన్యం విఫలమైంది.. అందుకే తాను వైదొలిగినట్లు ఎలాన్ మస్క్ పేర్కొంటున్నారు.