జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సోమవారం ఉదయం ప్రకటించింది. జూన్ నెలలో జరిగిన ఆ ఎంట్రన్స్ ఫలితాలను సకాలంలో వెల్లడించారు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఈనెల 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. మొదటి సెషన్ ఫలితాలను కింది వెబ్ సైట్ లోఅందుబాటులోఉంచినట్లు ఎన్టీఏ తెలిపింది. nta.ac.in, ntaresults.nic.in, jeemain.nta.nic.in.