సూర్యాపేట జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగవకాశాలు

రచ్చబండ : సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం సూర్యాపేట జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీల ద్వారా మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి యస్. మాధవ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 27న ఉదయం 11 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.

సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్ ఎక్జిక్యూటివ్ పోస్టులు 400 ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు రూ.12,000 నుంచి రూ.20,000 వరకు ఇవ్వబడును. టెలీ కాలర్స్ 10 పోస్టుల ఖాళీలు కలవు. జీతం నెలకు రూ.12,000కు అదనం, 10,000 కమీషన్ ఇవ్వబడును. ఆయా పోస్టులకు ఎస్సెస్సీ నుంచి ఎంబీఏ వరకు చదివి, వయసు 18 నుంచి 30 సంవరాల వయసు కలిగిన వారు అర్హులు.

నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ లో క్లర్క్, ఆఫీసర్/సీనియర్ ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్ – హెచ్ఆర్, ఐటీ, సేల్స్, ఆపరేషన్స్, డ్రైవర్స్, క్లీనర్స్, ట్రైనీ హార్డ్వేర్, మెకానిక్ హెల్పెర్ – మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు జీతాలు రూ.11,000 నుంచి రూ.18,000 వరకు ఇవ్వబడును. ఎస్సెస్సీ, ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ, పీ.జీ, ఐటీఐ (డీజిల్ మెకానిక్) చదివి, 18 సంవరములు నుంచి 35 సంవరముల వయసు కలిగి ఉన్న స్త్రీ, పురుషులు అర్హులు.

ఆసక్తి కలిగిన వారు 27న ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఒక జిరాక్స్ కాపీ, ఒక పాస్ ఫొటోతో సూర్యాపేట జిల్లా కేంద్రం పరిధిలోని దురాజ్ పల్లిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం, రూమ్ నెం:23లో హాజరు కాగలరు అని జిల్లా ఉపాధి కల్పన అధికారి యస్. మాధవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇతర వివరములు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. సుకృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్- హెచ్ఆర్ మేనేజర్ 9573381973, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ – హెచ్ఆర్ మేనేజర్ 7995545407, 9246618430 నెంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.