ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు.. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో చర్య

రచ్చబండ : హైదరాబాద్ నగరంలోని గోషామహాల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నది.

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఆ పార్టీ పేర్కొన్నది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.