రచ్చబండ : గత కొన్నాళ్లుగా వసతీ సౌకర్యాలపై నిరసనలు వెళ్తువెత్తుతున్న బాసర ట్రిబుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వమే కదిలొచ్చేదాకా విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. ఎట్టకేలకు కొన్నింటిని పరిష్కరించుకోగలిగారు. ఇంకా కొన్ని అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ దశలో కళాశాలలోని ఓ హాస్టల్ లో విషాదం నెలకొంది.
బాసర ట్రిబుల్ ఐటీ కళాశాలలో సురేష్ అనే విద్యార్థి కళాశాల హాస్టల్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లికి చెందినట్లుగా గుర్తించారు. విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.