తాజా ఉద్యోగ నోటిఫికేషన్

• మే 15 వరకు దరఖాస్తు గడువు

మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా.. డిప్లొమా హోల్డర్లా.. ఐటీఐ చేసి ఉన్నారా.. మీ కోసమే తాజా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది.

ఓఎన్జీసీ సంస్థలో దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ట్రేడ్/డిసిప్లీన్ లలో ట్రైనీ అంప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఖాళీలన్నీ కలిపి 3600 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రొగ్రామింగ్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, లేబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్ (కార్డియాలజీ అండ్ ఫిజియాలజీ) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించారు.

ఇంకా మేడికల్ లేబొరేటరీ టెక్నీషియన్, వెల్డర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, రిప్రిజిరేషన్ మరియు ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఢిల్లీ, డెహ్రాడూన్, జోధ్పూర్, ముంబై, గోవా, హజీరా, కాంబే, వడోదర, అంకలేశ్వర్, అహ్మదాబాద్, మొహసానా, జొర్హాట్, సిల్చార్, నజీరా, శివస్ నగర్, చెన్నై, కాకినాడ, రాజమండ్రి, కారైకల్, అగర్తల,
కోల్ కతాలో పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 27 నుంచే ప్రారంభమయ్యాయి. మేనెల 15వ తేదీ సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తులకు ఆఖరు గడువు ఉంది. మేనెల 23న ఫలితాలను ప్రకటించి, ఎంపిక జాబితాను వెల్లడిస్తారు.