ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి

రచ్చబండ : ఏఐఏడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళని స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నైలో సోమవారం జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఆయన ఈ పదవిలో నాలుగు నెలల పాటు కొనసాగుతారు.

మరో నాలుగు నెలల అనంతరం జరిగే ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించి, నూతనంగా ఎన్నుకోవాలని కోరుతూ తీర్మానించారు. పార్టీ ప్రాథమిక సభ్యులతో ఆ పదవికి ఒక వ్యక్తిని ఎన్నుకునేలా తీర్మానాన్ని ఆమోదించారు.

ఇదిలా ఉండగా సోమవారం జరిగే సమావేశాన్ని వాయిదా వేయాలంటూ ఆ పార్టీ నేత పన్నీరు సెల్వం ఫిర్యాదును తొసిపుచ్చుతూ మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏఐఏడీఎంకే సమావేశం జరుపుకునేందుకు అనుమతిని మంజూరు చేసింది.