రచ్చబండ: పాఠశాల విడిచి పెట్టారు. అందరూ ఇళ్లకు చేరుకున్నారు.. తమ పిల్లవాడు రాకపోయే సరికి అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఊరంతా వెతికారు. ఎక్కడా జాడలేదు. బడిలో ఉన్నాడేమోనని ఆలస్యంగా అటుగా వెళ్లి చూశారు.
ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకొంది. పాఠశాల సమయం పూర్తయ్యాక గదులన్నీ చూసి సిబ్బంది తాళాలు వేసేవారు. కానీ ఓ ఐదేళ్ల బాలుడైన ఆదిత్య నిద్రలో ఉన్న విషయాన్ని గమనించలేదు.
పిల్లలందరూ వచ్చాక కూడా తమ పిల్లవాడు రాలేదని గ్రహించిన అతడి తల్లిదండ్రులు రాత్రి వరకూ గ్రామంలో వెతికారు. చివరగా బడి వద్దకు వెళ్లే సరికి ఆ బాలుడు లోపలి నుంచి గుక్కపెట్టి ఏడ్వసాగాడు. బావురుమని ఆ తల్లిదండ్రులు కొడుకును అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.