గురుకుల తరగతి గదుల్లో 2 అడుగుల మేర వర్షపు నీరు.. విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

రచ్చబండ, సూర్యాపేట : భారీ వర్షాలు బడి పిల్లలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వ అధికారుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. తరగతి గదుల్లో రెండు అడుగుల మేరకు వర్షపు నీరు చేరి విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మంచాలపైనే వారు అవస్థలు పడ్డారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రం పరిధిలోని క్రాస్ రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాలలోకి వర్షపు నీరు చేరింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలిసిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.

గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు క్రాస్ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. తర్వాత అధికారుల హామీతో ఆందోళన విరమించారు.