క్యాబేజీని కరివేపాకులా తీసేస్తున్నారా?

ఇప్పుడున్న రోజుల్లో ఏ పదార్థాలు తినాలో.. ఏవి తినకూడదో.. కొంత అయోమయం నెలకొంది. కానీ మనం కొన్నింటిని కరివేపాకుల్లా తీసిపారేస్తుంటాం. అలా తీసివేసే వాటిలో క్యాబేజీ ఒకటి. కానీ దాని వల్ల ఎన్ని సుగుణాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం మీరు వదిలేయరు తెలుసా..

డయాబెటీస్ ఉన్న వారు క్యాబేజీని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని వైద్యులే నిర్ధారించారు.
క్యాబేజీ తినడం ద్వారా విటమిన్-కె మన శరీరంలోకి వస్తుంది. దీంతో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుందట. దీంతో డయాబెటీస్ ఉన్న వారు తరచూ క్యాబేజీ తింటుంటే తప్పక మేలు కలుగుతుంది.

క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీంతో మనిషికి కావాల్సిన బలవర్థకమైన ఆహారం లభిస్తుంది.

మరో విశేషమేమంటే క్యాన్సర్ ను నిరోధించడంలో క్యాబేజీ క్రియాశీలకంగా పని చేస్తుందని వైద్యులు తెలిపారు. దీంతో తరచూ తినాలని చెప్తున్నారు. ముఖ్యంగా పేగు క్యాన్సర్ కూ దూరంగా ఉండొచ్చన్న మాట.

క్యాబేజీ మరికొన్ని శరీర రుగ్మతలను తొలగిస్తుంది. దీనిని తరచూ తింటుంటే చర్మంపై మచ్చలు తగ్గుముఖం పడుతాయట. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. మరీ ముఖ్యంగా అధిక కొవ్వును కరిగించే గుణాలు క్యాబేజీలో ఉన్నాయట. మరి క్యాబేజీని కరివేపాకులా ఏరిపారేయకుండా తరచూ తింటుంటారు కదూ.