మహిళను వెంటాడి కొట్టిన లాయర్

ప్రతీ చోట మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అవుతున్నాయి. పురుషాహంకారం మహిళను అణిచివేయడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఎక్కడో ఓ చోట ఎదురు తిరిగేవారు బచాయిస్తున్నా.. ఎక్కువ మంది నుంచి నిస్సహాయతే వ్యక్తమవుతుంది.

మహిళలపై దాడులు, దౌర్జన్యాల నిరోధానికి ఎంతగా చట్టాలొచ్చినా నిరోధించలేకపోతున్నాయి. చట్టాలను కాపాడాల్సిన న్యాయవాదే సహనం కోల్పోయి ఓ మహిళపై దాడికి దిగిన ఘటన చోటుచేసుకొంది. అది కూడా కోర్టు ఆవరణలో జరగడం గమనార్హం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకొంది. భర్త నుంచి విడాకుల కోసం ఓ మహిళ దరఖాస్తు చేసుకుంది. భరణం కోసం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసు కోర్టు విచారణ సందర్భంగా భార్యాభర్తల నడుమ వాగ్వాదం చోటుచేసుకొంది. దీంతో భర్త తరఫు వాదిస్తున్న లాయర్ కోర్టు ఆవరణకు రాగానే మహిళను కొట్టాడు. ఆ అబల పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.

ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుగుతన్నారు.