మీరు చదివింది నిజమే.. నిమ్మకాయల కుంభకోణం బట్టబయలైంది. బాధ్యుడైన ఓ అధికారిపై వేటు పడింది. గతంలో ఇదే రచ్చబండలోనే నిమ్మతోటలో దొంగలు పడ్డారు.. అన్న వార్తను మనం చదువుకున్నాం. ఇది కూడా ఇదే కోవకు చెందింది.
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా మోడ్రన్ జైలులోనే ఈ నిమ్మకాయల అవినీతి చోటుచేసుకుంది. జైలు రికార్డుల్లో 50 కిలోల నిమ్మకాయలు కొన్నట్లు నమోదు చేసి ఉంది. అయితే తమకు నిమ్మకాయలే ఇవ్వడం లేదంటూ ఖైదీలు చెప్పుకొచ్చారు.
నిమ్మకాయల అవకతవకలపై ఏకంగా ఆ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విచారణలో అవకతవకలు జరిగినట్లు బయటపడింది. దీంతో జైలర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. చూశారా.. ఔరా నిమ్మకాయలకు ఎంత కలికాలం వచ్చిదో..